in

Balakrishna’s key role in KGF 2, says Google!

ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్  విలన్ అధీరా పాత్ర లో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట.  అయితే.. ఈ సినిమాపై మరో వార్త వైరల్‌ అవుతోంది. “కేజీఎఫ్‌-2” లో బాలకృష్ణ నటిస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. అంత భారీ సినిమాలో బాలయ్య లాంటి హీరో నటిస్తున్నారంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. అందుకే కేజీఎప్‌-2 లో బాలయ్య నటిస్తున్నారనే విషయం సంచలనంగా మారింది.

నిజానికి కేజీఎఫ్‌-2 లో బాలయ్య నటిస్తున్నారని చిత్ర బృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ.. గూగుల్‌ మాత్రం కేజీఎఫ్‌-2 సినిమా నటీనటుల జాబితాలో బాలయ్య పేరును చేర్చేసింది. అంతేకాదు… బాలయ్య “ఇనాయత్‌ ఖలీల్‌” అనే పాత్రలో నటిస్తున్నట్టు కూడా ఖరారు చేసింది. నిజమేమిటంటే..  “ఇనాయత్‌ ఖలీల్‌” పాత్రలో వేరే నటుడికి బదులుగా పొరపాటున బాలయ్య పేరు వేసేసింది. దీంతో బాలయ్య పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

alia bhatt worked 18 months for ‘rrr’ dialogues!

Niharika heads to Maldives for honeymoon with hubby Chaitanya!