in

Balakrishna to romance Sonakshi Sinha?

హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలకు హిందీలో పేరున్న నటీనటులను తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నారట. హీరోయిన్ ను కూడా హిందీ నుంచి తీసుకున్నట్లు సమాచారం. మొదట త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు అనిల్ రావిపూడి.

దానికి తగ్గట్లుగా బాలీవుడ్ హీరోయిన్ ఉంటే మార్కెట్ పరంగా కలిసొస్తుందనేది ప్లాన్. ఈ క్రమంలో సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ బబ్లీ హీరోయిన్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. సౌత్ లో రజినీకాంత్ తో కలిసి ‘లింగా’ అనే సినిమా కూడా చేసింది. ఇప్పుడు బాలయ్యతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది. ఈమె కంటే బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారు కానీ దాదాపు సోనాక్షినే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని టాక్. నిజానికి నవంబర్ లో సినిమాను మొదలుపెట్టాలనుకున్నారు కానీ ఇప్పుడు వచ్చే ఏడాదికి పుష్ చేశారు..!!

Kamal, Mani Ratnam join hands after 35 years of ‘Nayakan’!

Samantha slammed headlines calling her disease life-threatening!