ఒకప్పుడు ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్.. పట్టిందల్లా బంగారమే..ఒకదశలో వరుస విజయాలతో బాక్సాఫీస్ కి ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ రివర్స్. గత మూడన్నరేళ్ళుగా ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా రకుల్ ఖాతాలో పడడం లేదు. థియేటర్స్ లో అయినా.. ఓటీటీలో అయినా రిజల్ట్ ఒకటే అన్నట్లుగా ఆమె కెరీర్ సాగుతోంది. ఇటీవల కాలంలో రకుల్ కి కాస్తో కూస్తో ఊరటనిచ్చిన సినిమా అంటే..అది బాలీవుడ్ మూవీ `దే దే ప్యార్ దే` (2019) మాత్రమే. అది మినహాయిస్తే..రకుల్ ప్రీత్ ఖాతాలో మరో చెప్పుకోదగ్గ చిత్రం లేదు.
bad luck still continues for rakul preet singh!
మరీముఖ్యంగా.. హిందీలో ఈ మధ్య రకుల్ నటించిన `మర్జావాన్`, `సిమ్లా మిర్చి` చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. ఇక రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన `సర్దార్ కా గ్రాండ్ సన్` చిత్రం కూడా ఆమె బాలీవుడ్ కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ కాలేకపోయింది. మొత్తమ్మీద.. 2021 ఆరంభంలో `చెక్`, వేసవిలో `సర్దార్ కా గ్రాండ్ సన్`.. ఇలా రకుల్ కి నెగటివ్ రిజల్ట్స్ నే దక్కాయి. ఈ నేపథ్యంలో.. రకుల్ టైమ్ అస్సలు బాగోలేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి..రాబోయే చిత్రాలతోనైనా రకుల్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.