హీరో శ్రీకాంత్ గారు చదువుకొనే రోజుల్లో, ఆత్మహత్య చేసుకొంటానని వాళ్ళ ఇంట్లో వారిని బెదిరించారట, ఎగ్జామ్స్ ఫెయిల్ అయినందుకో, లేక పక్కింటి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చినందుకో అనుకొంటారేమో,ఇదేదీ కాదండి బాబు. శ్రీకాంత్ కుటుంబం కర్ణాటక రాష్ట్రం గంగావతి లో ఉండేవారు, స్కూల్ డేస్ లో కాస్త అల్లరి చేయటం సహజం, ఆ అల్లరిలో భాగంగానే శ్రీకాంత్ గారు పక్కింటి పెరట్లో ఉన్న జామ చెట్టు మీది దొర జామ కాయలు కోశారట, పక్కింటి వారు అదేదో క్షమించరాని నేరం అయినట్లు, వారి ఆస్తి దోచుకున్నంత గొడవ చేశారట, కోపం వచ్చిన శ్రీకాంత్ నాన్న గారు శ్రీకాంత్ కోసం వెతికారట, దొరికితే ఎక్కడ చితకబాదుతారో అని భయపడి ఇంట్లోనుంచి పారిపోయి ఫ్రెండ్స్ తో వర్తమానం పంపారట తనను దండించాలని చూస్తే కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొంటానని. భయపడిపోయిన కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గారిని బుజ్జగించి, వాళ్ళ నాన్న గారిని బతిమాలి శ్రీకాంత్ గారిని ఇంటికి లాక్కొని వెళ్లారట, ఇది కూడా ఒక పెద్ద నేరమా చెప్పండి, పక్కింటి వారి హంగామా చూసి కోపం వచ్చిందే కానీ ఏ తండ్రి ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకుంటారు చెప్పండి.