చాల సినిమాలలో రిస్క్ షాట్స్ లో హీరోలకు బదులు డూప్స్ నటిస్తుంటారు, పాత రోజుల్లో డ్యూయల్ రోల్ సినిమాలలో కూడా కొన్ని చోట్ల డూప్ తోనే మేనేజ్ చేసే వారు, చాల చిత్రాల్లో యెన్.టి.ఆర్. కి కైకాల సత్యనారాయణ గారు డూప్ గ నటించారు, అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం లో, ఒక సీన్ లో శ్రీ దేవి గారికి డూప్ గ నటించిన మన తెలుగు నటి ఎవరో తెలుసా ? ఇంద్రజ ( శ్రీ దేవి ) దేవకన్య అని తెలుసుకొన్న మహాద్రష్ట ( ఆమ్రేష్ పురి ) ఆమెను చెర బట్టేందుకు వచ్చినపుడు, ఇంద్రజ తాను ఉంటున్న ఇంటి వెనక ఉన్న సరస్సు లో ఈత కొడుతుంటుంది. శ్రీదేవి గారికి ఈత రాకపోవటం వలన ఆ సీన్ లో ఆమెకు బదులుగా, మనకు బాగా పరిచయం అయిన నటి హేమ, శ్రీ దేవి గారికి బదులుగా సరస్సు లో ఈదుతూ కనిపించారు, అందుకే ఆ సీన్ లాంగ్ షాట్ లో ఉంటుంది. ఆ తరువాత హేమ గారు” క్షణ క్షణం ” లో శ్రీ దేవి గారికి స్నేహితురాలు రోల్ లో నటించటం జరిగింది..