in

Arya in Talks for a Powerful Police Role in NBK112?

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్తారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే చిత్రమిది. ఇంతకు ముందు ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు హల్‌ చల్ చేశాయి. అయితే వాటిని చిత్ర నిర్మాతలు ఖండించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… ఇందులో ఓ తమిళ్ హీరో కీలక పాత్ర చేయనున్నారు..

కోలీవుడ్ యంగ్ హీరో ఆర్యకు తెలుగులో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘వరుడు’లో విలన్ రోల్ చేశారు. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ – కొరటాల శివ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఆర్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ..ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సైంధవ్’ సినిమాలో ఆర్య ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఆర్యతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం..!!

suriya to romance dc beauty Wamiqa Gabbi!