మూడు సంవత్సరాల క్రితం తమిళ స్టార్ హీరో అర్జున్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తాజాగా ఈ కేసులో హీరో అర్జున్ కి ఊరట లభించింది. ఈ కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం సంచలనమైన ఈ కేసులో అర్జున్ పూర్తిగా ఇరుక్కుపోయాడని అప్పట్లో వార్తలోచ్చాయి. ఇక ఇదే లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రైటర్ వైరముత్తుపై తమిళనాడు సినీ పరిశ్రమలో అనధికారిక బహిష్కరణ కొనసాగుతుంది.
దాంతో అర్జున్ కి కూడా ఇదే శిక్ష వేయాలంటూ పెద్దఎత్తున తమిళనాడులో మహిళలు నిరసనలు తెలుపుతుండగా.. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చిపడింది. అర్జున్ పై వచ్చిన అభియోగాల్లో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు.