
అర్జున్ రెడ్డి సినిమాలో నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఎవరో గుర్తుపట్టారా, తను ఎవరో కాదండోయ్ అలనాటి అందాల నటి కాంచన గారు. మంచి గ్లామర్ రోల్స్ చేసి ఎంతో పేరు డబ్బు సంపాదించినా ఆవిడని కన్నవాళ్ళే డబ్బు కోసం మోసం చేసారు. తనకు పెళ్లీడు వచ్చిన కానీ కరెన్సీ యంత్రం గ ఇంట్లో ఉన్న కాంచన గారిని పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికి ఇష్ట పడలేదు ఆమె తల్లి తండ్రులు. ఆమె సంపాదించింది అంత కాజేసి కన్నవాళ్ళే నడిరోడ్డు మీద నిలబెట్టారు. అయినా కానీ ధైర్యంతో నిలిచి పోరాడి గెలిచింది, డబ్బుకి మించిన సంతోషం ఉందని గ్రహించిన ఆవిడ మళ్ళి డబ్బు సంపాదించి ఆ ఏడుకొండల వారి దయతోనే జీవితాన్ని గెలిచానంటూ చివరికి ఉన్నదంతా తిరుమల తిరుపతి దేవస్థానానికి వివరాలంగా ఇచ్చేసారు కాంచన గారు. ఇంక డబ్బుపై విరక్తి పుట్టిన ఆవిడ బెంగుళూరు లోని ఒక ప్రముఖ దేవస్థానంలో పెళ్లి చేసుకోకుండా అక్కడే జీవయాపన సాగిస్తూ వచ్చారు. తల్లి తండ్రుల ప్రేమకు నోచుకోకుండా కాంచన గారు అనుభవించిన కష్టం నిజంగా చాల బాధకారం కాదు.

