టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. వరుసగా లైవ్ చాట్ లు పెడుతూ.. తమ ఫాలోవర్లతో ముచ్చట పెడుతున్నారు..తాజాగా లైవ్ సెషన్ నిర్వహించిన సుప్రితకు నెటిజన్ల నుండి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా.. “ఏదైనా అడగండి, సమాధానాలు చెబుతా” అంటూ లైవ్ మొదలుపెట్టింది సుప్రిత. ఇందులో భాగంగా ఓ నెటిజన్ “నువ్ వర్జినా..?” అంటూ అడగకూడని ప్రశ్నను సంధించాడు.
ఇది చూసిన సుప్రిత అదిరిపోయే కౌంటర్ రిప్లై ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో కోర్ట్ సీన్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ తన సమాధానం చెప్పకనే చెప్పింది. సినిమాలో ప్రకాష్ రాజ్.. నివేదా థామస్ ను కోర్టులో ఇలాంటి ప్రశ్నే అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతాడు. ఆ సీన్ ను సుప్రిత షేర్ చేసింది. మొత్తానికి అమ్మడు రియాక్షన్ చూసిన వాళ్లు గట్టిగానే ఆన్సర్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.