నటుడు నాని ఏపీ ప్రభుత్వం పై సంచలన కామెంట్లు చేశాడు. సినిమా టికెట్ల రేట్లను తగ్గించటాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఇది కచ్చితంగా ప్రేక్షకుడిని అవమానించినట్లేనని అన్నాడు. శ్యామ్ సింగరాయ్ మూవీ టీమ్ తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం మూవీ టికెట్ల రేట్లను తగ్గించటంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు చాలా తగ్గించారని ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలకు గిట్టుబాటు కాదని సినిమా ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.
ఐతే ఇదే విషయాన్ని నాని గట్టిగానే మాట్లాడారు. రాజకీయాలు, సినిమాలు అనే విషయం పక్కన పెడితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రేక్షకులను అవమానించేలా ఉందన్నాడు. “ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. టికెట్ల ధరలు తగ్గించటమంటే ప్రేక్షకులను అవమానించినట్లే. థియేటర్ల కలెక్షన్ల కన్నా కూడా పక్కన ఉండే కిరాణ షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ధరలు పెంచిన ప్రేక్షకులకు కొనే కెపాసిటీ ఉంది. అయిన నేను ఏదీ మాట్లాడిన వివాదమే అవుతుంది”. అంటూ నాని కామెంట్స్ చేశాడు.