తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటిస్తే ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు అని అన్నాడు. పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా అన్నారని, ఉద్దేశ్య పూర్వకంగానే బన్నీ మీద, పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు..
పవన్ చేసిన కామెంట్లు, వేసిన సెటైర్లతో మెగా వర్సెస్ అల్లు ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది.చూస్తుంటే ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ పవన్ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ని ఉద్దేశించి కాదని అన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేది పవన్ కల్యాణ్ ఆలోచన అని , పవన్ చేసిన కామెంట్స్ కేవలం అడవుల నరికీవేతపై మాత్రమేనని, అల్లు అర్జున్ నో, మరొకరినో ఉద్దేశించి కాదని చెప్పుకొచ్చారు..!!