
ప్రభాస్ తను ఇద్దరు మంచి స్నేహితులని అనుష్క చెప్తూ ఉండేది. అంతే కదా ఇటీవల కాలంలో ఈమె ఇండస్ట్రీకి దూరం అవడంతో ఓ ప్రముఖ బిజినెస్ మాన్‌ను పెళ్లి చేసుకుంటుంది అంటూ..అందుకే ఇండస్ట్రీకి దూరమైందంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలో పెళ్లి వార్తలపై రియాక్ట్ అయిన అనుష్క.. ప్రతి ఒక్కరూ నా పెళ్లి పెళ్లి అంటూ తెగ వార్తలు రాస్తున్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో..జరిగిందో మాత్రం చెప్పడం లేదు. పెళ్లి విషయంలో దాచాల్సినంత అవసరం ఏమీ ఉండదు. అది నేరం కాదు. అదొక ఎమోషనల్ జర్నీ. ఇకనైనా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి అంటూ ఫైర్ అయింది. ఆ సమయం వస్తే ప్రతి ఒక్కరితో నేనే షేర్ చేసుకుంటాను అంటూ అనుష్క వెల్లడించింది. ప్రస్తుతం అనుష్క చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి..!!

