మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాలో నాగ వల్లి గ నటించి తానే డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆశ్చర్య పరిచింది మలయాళీ భామ అనుపమ. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో సమతా కంటే కూడా ఈ అమ్మడు ఎక్కువ మార్కులు వేయించుకుంది. మలయాళంలో అనుపమ నటించిన ప్రేమమ్ చిత్రం అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాని తెలుగులో కూడా తీశారు. మలయాళం ప్రేమమ్ లో ఆమె నటించిన సేమ్ రోల్ తెలుగులోనూ చేసి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత శర్వానంద్ సరసన ‘శతమానం భవతి’ సినిమాలో నటించి హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకుంది.
దీంతో ఇక ఈ బ్యూటీకి తిరుగులేదని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తప్పయ్యాయి. ‘శతమానం భవతి’ సినిమా తర్వాత ‘ఉన్నదీ ఒక్కటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు ఆమెకు పరాజయాన్ని అందించాయి. ఇక ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ కు టాలివుడ్ లో సినిమా ఛాన్సులు మొహం చాటేశాయి. ఛాన్సులు లేక సతమతమవుతున్న అనుపమకు రామ్ పోతినేని తో ఆమె నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం , బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన ‘రాక్షసుడు’ సినిమాలు మంచి విజయాలు అందుకున్నా కూడా ఆమెను ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మే కన్నడలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పర్వాలేదనిపించుకున్న సమయంలో తమిళ, మాలయంలో ఛాన్సులు వచాయి. దీంతో ఇటు టాలీవుడ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయ్యిందట. ఏదేమైనా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ ని టాలీవుడ్ కోల్పోయినట్లేనని చెప్పాలి.