ప్రపంచ వ్యాప్తంగా ఒకటే సమస్య మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. అదే కరోనా మహమ్మారి వైరస్.. ఈ కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది మృత్యు ఒడిలోకి చేరారు . అందుకే ప్రజలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని కరోనా వైరస్ మనుషుల నుంచి వ్యాపిస్తుందని వీలైనంత వరకు వారిని చేతులతో ముట్టుకోరాదని సూచిస్తున్నారు.ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ ను వాడుతూ చుట్టూ పక్కల శుభ్రాంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనాలను బయటకు తిరగ కూడదని నిర్ణయించింది. అయినా కొందరు బయట తిరుగుతున్నారు.
తాజాగా ఈ విషయం పై స్పందించిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్ జనాల తీరుపై మండిపడింది. వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగిస్తున్న మాస్కులను ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారని, ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు విసిరిపారేసిన మాస్కుల ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.మనం కరోనాతో పోరాడుతున్న తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. వాడి పారేసిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో వేయాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి మాస్కులు కనిపిస్తే తాకొద్దు, వాడొద్దని సూచించింది.ప్రజలు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని సూచింది.