నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హాస్య పాత్రలతో తన సత్తా చాటిన విలక్షణ నటుడు. తన కెరీర్ ప్రారంభ దశలో రాజేంద్రుడి కి ఒక చేదు అనుభవం ఎదురైనది, నటుడిగా హస్య పాత్రలే కాదు సీరియస్ రొల్స్ కూడా చేయగలరు అని ఎర్ర మందారం సినిమా తో రుజువు చేసుకున్నారు. ఒక్క సారిగా తెలుగు సినిమా దృష్టిని తన వేపు తిప్పుకున్నారు ఒక్క సినిమా తో. ఆ టైం లోనే క్రియేటివ్ కమర్సిల్స్ , కే.ఎస్. రామ రావు గారు తమిళ్ లో సూపర్ హిట్ అయిన చిన్న తంబీ రైట్స్ కొన్నారు, అందులో హీరో గ రాజేంద్ర ప్రసాద్ ను అనౌన్స్ చేసారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు దెబ్బతో రాజేంద్ర ప్రసాద్ తంతే గారెల బుట్టలో పడ్డారు అనుకున్నది తెలుగు ఇండస్ట్రీ మొత్తం.
కానీ చేతికి వచ్చింది నోటికి అందె వరకు నమ్మకం లేదంటారు పెద్దలు, అదే జరిగింది రాజేంద్రుడి విషయం లో. ఏమి జరిగిందో తెలియదు అదే సినిమా లో హీరో గ దగ్గుబాటి వెంకటేష్ గారి పేరు అనౌన్స్ చేసారు రామ రావు గారు, ఎవరితో చెప్పుకోలేక మౌనం గ చూస్తుండిపోయాడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ చేదు అనుభవం ఆయనను చాల కాలం వెంటాడింది , ఆ తరువాత నటుడిగా అయన అందుకున్న విజయాల దొంతరల మాటున పడి పోయింది. ఇటువంటి అనుభవం ప్రతి నటుడికి సర్వ సాధారణం.