in

anu emmanuel’s career at big risk!

న్నో అంచనాల మధ్య రిలీస్ అయినా అజ్ఞాతవాసి అను ఇమ్మాన్యుయేల్ కి మాత్రం అసలు ఉపయోగపడలేదు. ఇక రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమా జనాలకి పెద్దగా ఎక్కలేదు. ఇలా కెరీర్ ప్రారంభం నుంచి అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న సినిమాలన్నీ సక్సెస్ కాక అవకాశాలు అందుకోవడంలో వెనకపడింది. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కి హిట్ ఇవ్వలేకపోయింది.

ప్రస్తుతం ఈమె చేతిలో మహా సముద్రం సినిమా ఒకటే ఉంది. దీనిమీదే అను ఇమ్మాన్యుయేల్ ఆశలన్నీ పెట్టుకుంది. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమాలో శర్వానంద్ – సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా సక్సెస్ దర్శకుడు అజయ్ భూపతికి, శర్వానంద్, సిద్దార్థ్‌లకి, హీరోయిన్స్ అనూ ఇమ్మానియేల్, అదిథి రావు హైదరికీ చాలా కీలకం. వీరందరికీ ఈ సినిమా హిట్ అనేది తప్పనిసరి. ఈ ఒక్క సినిమా రిజల్ట్ గనక తేడా కొడితే మాత్రం అందరికీ ఇబ్బందే. ఏమవుతుందో చూడాలి.

mehreen pirzada cute stills in yellow dress!

rgv gives most dirtiest comment about sridevi!