అక్కినేని నాగేశ్వర్ రావు గారి చాతుర్యం వలన తిరిగి ప్రారంభం అయిన మాయాబజార్ షూటింగ్. మాయాబజార్ షూటింగ్ మధ్యలో ఆగిపోయింది, ఎందుకో తెలుసా ? దర్శకుడు కే.వి. రెడ్డి గారు ఆ చిత్రానికి ఇచ్చిన బడ్జెట్ 26 లక్షలు ,10 నుండి 12 లక్షలలో భారీ చిత్రాలు తయారు అవుతున్న రోజుల్లో అంత పెద్ద బడ్జెట్ తో సినిమా చేయటం రిస్క్ అనుకున్న విజయ వారు సినిమా మధ్యలో ఆపేసారు. ఆ విషయం తెలుసుకున్న అనేక మంది నిర్మాతలు కే.వి. రెడ్డి గారి వద్దకు వెళ్లి ఆ సినిమా మేము మేము తీస్తాం అంటే, మేము తీస్తాం అని ముందుకు వచ్చారు అయినా కే.వి. రెడ్డి గారు తనకు కోటి రూపాయలు ఇచ్చిన మాయాబజార్ వేరే వారికీ చేయను, చేస్తే విజయ వారికే చేస్తాను, అని తెగేసి చెప్పేసారు. అంత మంచి సినిమా ఆగిపోయిన బాధ ఆయనకు ఉన్నకూడా ఆయన వేరే నిర్మాతలకు ఆ సినిమా చేయ లేదు. ఆ పరిస్థితుల్లో అక్కినేని నాగేశ్వర్ రావు గారు నాగి రెడ్డి గారి వద్దకు వెళ్లి ,
నన్ను అభిమన్యుడిగా పెట్టి సినిమా చేస్తాము అని నిర్మాతలు నా దగ్గరికి వస్తున్నారు, మీరు మాయాబజార్ చేస్తారో లేదు చెపితే బాగుంటుంది అని లౌక్యంగా అడిగారట, అది విన్న నాగి రెడ్డి గారు ఆలోచనలో పడ్డారు, తాము తీయకపోతే తీసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు, మనం చేయకపోతే ఈ సబ్జెక్టు చేయి జారిపోతుంది అనుకోని, మళ్ళీ కే.వి. రెడ్డి గారిని పిలిచి సినిమా బడ్జెట్ ఎంత అవుతుందో మరొక సారి వర్క్ అవుట్ చేయమన్నారట, అప్పుడు కే.వి.రెడ్డి గారు 26 లక్షల కంటే ఎక్కువ అయితే ఆ ఖర్చు తానె భరిస్తాను అని చెప్పారట. అంతే ఇక మరో ఆలోచన లేకుండా సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టారట. ఆ విధం గ అక్కినేని గారి చాతుర్యం వలన ఒక గొప్ప కళాఖండం నిర్మితం అయింది, అది మనందరం చూసి తరించాము, ఇంకా తరిస్తూనే ఉన్నాము. లేకుంటే మాయాబజార్ అనే చిత్రం నిర్మాణం జరిగి ఉండేది కాదేమో.