అక్కినేని నాగేశ్వర రావు గారికి ఘంటసాల గారు తప్ప ఇంకెవరు పాడిన నప్పదు అని పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు గట్టిగ భావిస్తున్న రోజుల్లో, భరణి సంస్థ నిర్మించిన చక్రపాణి చిత్రం లో నాగేశ్వర రావు గారికి ఘంటసాల గారు ప్లే బ్యాక్ అందించలేదు. ఏ.యం. రాజా గారు పాడారు, అందరు ఆశ్ఛర్య పోయారు, కారణం తెలుసుకోవాలని అన్వేషించిన వారు కనిపెట్టిన సమాచారం ఏమిటంటే. భానుమతి గారి నిర్మాణ సంస్థ అయినా భరణి పిక్చర్స్ వారు నిర్మించిన చిత్రం చక్రపాణి, భరణి ఆఫీస్ లో పాటలు రిహార్సల్ చేస్తున్న ఘంటసాల గారిని చూసిన భానుమతి గారు,
ఘంటసాల గారు ఇది విజయ వారి సినిమా కాదు, మీరు బాగా పాడాలి, కాస్త గొంతు మార్చండి అన్నారట, భానుమతి గారి విషయం తెలిసిందే కదా, ఆమె కు దూకుడు ఎక్కువ, ఆమె మనసుకు ఏమి తోచితే అది మాట్లాడేస్తారు. ఆమె అన్న మాటలకూ నొచ్చుకున్న ఘంటసాల, అయితే మీకు నచ్చే విధంగా వేరే వాళ్ళతో పాడించుకోండి, అనేసి కోపంగా వెళ్లిపోయారట. భానుమతి గారు బతిమాలె రకం కాదు అందుకే, ఏ.ఏం. రాజా తో చక్రపాణి చిత్రంలో పాటలు పాడించారు..