
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]గ[/qodef_dropcaps] త ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన F2 చిత్రం తొ కెరీర్ లో వరసగా నాలుగవ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే, F3 టైటిల్ తొ తెరకెక్కనున్న ఈ సినిమా కి మరో స్టార్ హీరో కోసం వేట మొదలు పెట్టాడు డైరెక్టర్ అనిల్. తాజా సమాచారం ప్రకారం అనిల్ కి మూడో హీరో దొరికేసాడు అని తెలుస్తోంది, ఆ హీరో మరెవరో కాదండోయ్.. మాస్ మహరాజ్ రవితేజ. గతంలో అనిల్ దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాలో నటించి మంచి హిట్ కొట్టిన రవితేజ, F3లో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా సమాచారం.. ఫాన్స్ ఇంక పండగ చేసుకోడానికి రెడీ అవ్వండి.. ట్రిపుల్ ఫన్ విత్ జీరో ఫ్రస్ట్రేషన్!