
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఆర్[/qodef_dropcaps] ఆర్‌ఆర్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె ఇది వరకే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఒక సినిమా కూడా చేసింది. ఆమె ఎవరో కాదు.. ‘ఛత్రపతి’లో రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ శ్రియా. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఒకరు, బాలీవుడ్ నుంచి మరొకరిని తీసుకున్న రాజమౌళి తాజాగా.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు సైతం సినిమాలో అవకాశం కల్పించారట. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్‌దేవగణ్‌కు జంటగా ఆమె కనిపించనుందని సమాచారం. కాగా.. అటు రాజమౌళితో.. ఇటు అజయ్ దేవగణ్‌తోనూ ఆమె చేస్తున్న రెండో చిత్రమిది. అజయ్‌దేవగణ్‌తో కలిసి దృశ్యం సినిమాలో ఆమె నటించింది. అయితే, ప్రస్తుతం వీరిద్దరి మధ్యలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా ఒలీవియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. శ్రియ పాత్రపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.