తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా యాక్టర్ అవ్వడానికి పరోక్షంగా మన నందమూరి తారక రామ రావు గారు కారణం. రజనీకాంత్ గారు కండెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో ఆయన యెన్.టి.ఆర్. గారికి వీర అభిమాని, యెన్.టి.ఆర్. నటించిన ” మాయ బజార్ “, ” శ్రీ కృష్ణ పాండవీయం ” వంటి చిత్రాలు లెక్క లేనన్ని సార్లు చూసారు. రజని కండెక్టర్ గ పనిచేస్తున్న రోజుల్లో స్టాఫ్ అంత కలసి ఒక డ్రామా వేశారు అందులో రజని కి దుర్యోధనుడి పాత్ర ఇచ్చారు.
రజని ” శ్రీ కృష్ణ పాండవీయం” సినిమా చూసి,అన్నగారి ఇన్స్పిరేషన్ తో, ఆ డ్రామాలో దుర్యోధనుడి పాత్ర నటన అదరగొట్టారు. స్టాఫ్ అందరు మెచ్చుకున్నారు, సినిమాల్లో ప్రయత్నించమని, ప్రోత్సహించారు, ఆ సమయం లోనే మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రకటన చూసిన రజని, స్నేహితుడి ప్రోత్సాహం, ఆర్ధిక సహాయం తో ఇన్స్టిట్యూట్ లో చేరి, బాలచందర్ గారి ఆశీర్వాదం తో నటుడిగా రంగ ప్రవేశం చేసారు. భారత దేశం గర్వించతగ్గ నటుడిగా ఎదిగారు..