డేరింగ్ డాషింగ్ హీరో గ తెలుగు చిత్రసీమలో పేరు ఉన్న కృష్ణ గారు, చాల సాహసాలు చేసారు, ఎంతమంది వారించినా వినకుండా” అల్లూరి సీతారామరాజు” చిత్రం నిర్మించారు, అద్భుత విజయం సాధించారు, యెన్.టి.ఆర్. తో విరోధం కొనితెచుకున్నారు. అదే విధంగ అక్కినేని నటించిన ” దేవదాసు ” చిత్రం పునర్ నిర్మించి వివాదం కొని తెచ్చుకున్నారు. వినోద వారి దేవదాసు చిత్రం హక్కులు తీసుకోమన్న తీసుకోలేదు, ఆ చిత్రం హక్కులు అక్కినేని గారె కొన్నారు. ఒక రోజు ఎయిర్ పోర్ట్ లో అక్కినేని, కృష్ణ కలుసుకున్నారు ఆ సందర్భం గ కృష్ణ గారు అక్కినేని గారిని పాత దేవదాసు హక్కులు మీరు తీసుకున్నారని విన్నాను అని అడగగా. అక్కినేని గారు నవ్వుతు కృష్ణ గారి షర్ట్ జేబులోని సిగెరెట్ ప్యాకెట్ తీసుకొని సిగరెట్ కాలుస్తూ..
ఇదే నా ఆఖరి సిగరెట్ ఎందుకంటె నేను హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళుతున్నాను. దేవదాసు హక్కులు నేను కొన్నాను, నీ పిక్చర్ సినిమాస్కోప్, నా పిక్చర్ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి నువ్వు వర్రీ అవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి వెళ్లిపోయారు.కృష్ణ గారి దేవదాసు 1974 డిసెంబర్ 6 వ తేదీ రిలీజ్ అయితే, దానికి వారం ముందు అక్కినేని గారి దేవదాసు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రేక్షకులు రెండింటిని పోల్చి చూడటం తో కృష్ణ గారి దేవదాసు చిత్రం వెనుకబడింది, ఆర్ధికంగా భారీ నష్టాలను మిగిల్చింది. సాహసాలు అన్ని సందర్భాలలో కలసి రాక పోయిన కృష్ణ గారి సాహస యాత్ర అలాగే కొనసాగింది, అందుకే ఈ రోజుకి ఆయనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో.