రీమేక్ లు అన్ని హిట్ అవ్వాలని రూల్ లేదు. ఒక్కో సారి ఒరిజినల్ కంటే రీమేక్ లు సూపర్ హిట్ ఐన అరుదయిన సందర్భాలు ఉంటాయి. మరి కొన్ని చిత్రాలు “దృశ్యం” సినిమా లాగ రీమేక్ చేసిన ప్రతి భాషలో సూపర్ హిట్ అయినా సందర్భాలు ఉన్నాయి. కధాంశం ప్రాంతానికి, భాషకు అతీతంగా ఒక విశ్వజనీయత కలిగి ఉన్నప్పుడే అది సాధ్యం.అటువంటి కామన్ సబ్జెక్టు తో నిర్మించిన ఒక చిత్రం తెలుగులో అట్టర్ ప్లాప్ అయింది, అదే సబ్జెక్టు తో రీమేక్ చేసిన కన్నడ సినిమా సూపర్ హిట్ అయింది. “సింహాద్రి” సూపర్ హిట్ తరువాత యెన్.టి.ఆర్. హీరోగా, పూరి దర్శకత్వం లో వచ్చిన “ఆంధ్రావాలా” ఒక పెద్ద డిసాస్టర్.
ఆ చిత్రంలోని తండ్రి పాత్రకు యెన్.టి.ఆర్. వయసు ఒక మైనస్ పాయింట్ అయింది, నూనూగు మీసాల యెన్.టి.ఆర్. ను తండ్రి పాత్రలో అంగీకరించలేక పోయారు తెలుగు ప్రేక్షకులు. సింహాద్రి తరువాత భారీ అంచనాలు ఉండటం కూడా ఈ సినిమా కు ప్రతిబంధకం అయింది. విచిత్రం ఏమిటంటే ఇక్కడ డిజాస్టర్ అయినా ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేసి, అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న దివంగత పునీత్ రాజ్ కుమార్ సూపర్ హిట్ కొట్టారు. ఓవర్ ఎక్సపెక్టషన్స్ లేకపోతే సినిమా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ సాధించినట్లే, అదే పునీత్ రాజ్ కుమార్ కి అడ్వాంటేజ్ అయి ఉంటుంది. ఒక సినిమా హిట్ అవడానికి ఏ ఫాక్టర్ ఎప్పుడు ఎలా వర్క్ అవుట్ అవుతుందో చెప్పటం చాల కష్టం, మూడ్ అఫ్ ది మాబ్ ని అంచనా వేయటం అంత వీజీ కాదు బాస్..