సినిమా లేదా బుల్లి తెర రంగానికి చెందిన వారు క్రికెటర్స్ తో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఎన్నో జంటలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో జంట పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు బుల్లి తెరపై తనదైన శైలిలో అలరించిన యాంకర్ వర్షిణీ ప్రస్తుతం ప్రేమలో ఉందట. ప్రస్తుతం ఐపీఎల్ లో హైదరాబాద్ తరపున ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ తో గత కొన్నాళ్లుగా వర్షిణీ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు సాక్ష్యం అన్నట్లుగా గత కొన్నాళ్లుగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. వాషింగ్టన్ సుందర్ ఇటీవల మ్యాచ్ ప్రాక్టీస్ ను పక్కన పెట్టి వర్షిణీ తో తిరిగాడని.. దాంతో కోపంతో సన్ రైజర్స్ జట్టు అతడిని పక్కకు పెట్టడం జరిగిందని చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయమై బుల్లి తెర వర్గాలతో పాటు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది..!!