in

anchor shyamala Opens Up About Casting Couch!

తాజాగా యాంకర్ శ్యామల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సినీ పరిశ్రమలో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇక్కడ తెలియనివాళ్లు లేకపోవడంతో అవకాశాల విషయంలో కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాగే తన చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో తల్లి చాలా కష్ట పడి పెంచి పెద్ద చేసిందని అలాగే నటనపై తనకు ఆసక్తి ఉండటంతో తన తల్లి కూడా ఎంతగానో ప్రోత్సహించిందని అలాగే హైదరాబాద్ కి తనతోపాటు వచ్చిన ఎన్నో కష్టాలు పడిందని ఎమోషనల్ అయింది.

ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమయ్యే ధారావాహికలో నటించే అవకాశం రావడంతో తన సినీ కెరీర్ మొదలైందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఇదే దారావాహిక కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి తనని లైంగికంగా వేధించాడని దాంతో ధారావాహిక దర్శకనిర్మాతలకు తెలియజేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ తర్వాత తన భర్త నరసింహం పరిచయం కావడంతో తన భర్త తో చెప్పి ఆ వ్యక్తి కి వార్నింగ్ ఇప్పించానని దాంతో మళ్లీ ఆ వ్యక్తి తన జోలికి రాలేదని తెలిపింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడం కామన్ అని, కానీ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొనే సమయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన సినీ జీవితాన్ని నిర్ణయిస్తాయని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

Shraddha Replaces Nayanthara For Female Lead in Yuvaraj’s next!

sneha ullal photos at shachi store launch!