in

anchor Anasuya to get a bigger screen space for ‘pushpa 2’!

రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో అనసూయకు ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప తొలి భాగంలో అనసూయ పాత్ర పరిమితం కావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు..అయితే పుష్ప సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ హిట్ అనిపించుకోవడంతో అనసూయ అభిమానులు సంతోషిస్తున్నారు. అనసూయ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

పుష్ప సినిమా కోసం అనసూయ తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై గ్లామరస్ గా కనిపించే అనసూయ డీ గ్లామరస్ రోల్ లో పుష్పలో కనిపించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో అనసూయ మాట్లాడుతూ బన్నీ గురించి ఇంటర్వ్యూలలో చాలా చెప్పాలని అనుకున్నానని అయితే తండ్రి చనిపోయిన బాధ వల్ల ఇంటర్యూలకు హాజరు కాలేకపోయానని పేర్కొన్నారు.

తన లైఫ్ లో బన్నీ ఎంత ముఖ్యమైన వ్యక్తి అనే విషయం ఫ్యాన్స్ కు కూడా తెలియదని బన్నీని ప్రేమిస్తున్నానని ఒక పద్ధతిలో చెప్పగా అభిమానులకు ఇంకో పద్ధతిలో వెళ్లిందని అనసూయ చెప్పుకొచ్చారు. బన్నీ ఆర్మీ తనను చాలా తిట్టేశారని అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా బన్నీ ఇన్ స్పిరేషన్ అని అనసూయ పేర్కొన్నారు. పుష్ప మొదటి భాగంలో తనను తక్కువ చేసి చూపించారని అయితే రెండో భాగంలో మాత్రం తాను చక్రం తిప్పుతానని అనసూయ చెప్పుకొచ్చారు.

netizens call for boycotting the song for hurting Hindu sentiments!

‘Radhe Shyam’ Theatrical Trailer, Prabhas, Pooja Hegde!