
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]యాం[/qodef_dropcaps] కర్ అనసూయ ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్న తన మార్ఫింగ్ ఫొటోల విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పలు ట్విటర్ ఎకౌంట్ లలో తన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని శుక్రవారం ట్విటర్ సపోర్ట్ టీంకు.. సదరు ఎకౌంట్స్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీంతో పాటు వాళ్లు చేసిన కామెంట్స్ ను కూడా జత చేసింది. ఇందుకు సమాదానంగా ట్విటర్ తమ రూల్స్ కు విరుద్ధంగా సదరు వ్యక్తులు ప్రవర్తించలేదని మెసేజ్ ద్వారా బదులిచ్చింది. దీంతో అందులో తప్పులేదని చెప్పడం సరికాదని ట్విటర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ. ఆపై… సైబర్ క్రైం ను ట్యాగ్ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందుకు బదులిచ్చిన సైబర్ క్రైం పోలీసులు అనసూయ ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీంతో అనసూయ పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది.