in

anasuya responds on holi middle finger incident!

నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ  నెటిజన్లతో చిట్‌చాట్‌ చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలు.. వారి కామెంట్లకు స్పందిస్తూ అనసూయ రిప్లయి ఇచ్చారు. తన సౌందర్య రక్షణ, షూటింగ్ లు, తన చీరల సేకరణపై స్పందించారు. ఈ సందర్భంగా హోలీ పండుగ సమయంలో ‘మిడిల్‌ ఫింగర్‌’ చూపించిన విషయాన్ని ఓ నెటిజన్ ప్రస్తావించారు. తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో.. ఏం జరిగిందో అనసూయ వివరణ ఇచ్చారు..

హోలీ పండుగలో ఒకరికి మిడిల్‌ ఫింగర్‌ చూపించడంపై యాంకర్‌ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అగౌరవపరచాలనుకున్న వ్యక్తి.. నా వయసుపై అతడు చేసిన వ్యాఖ్యలకు అదే రీతిలో బుద్ధి చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాను చేసింది తప్పు కాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పరస్పరం గౌరవించుకోవాలని..కానీ అలా చేయడం తప్పని అనసూయ వ్యాఖ్యానించడంతో మరోసారి నెట్టింట్లో చర్చ జరుగుతోంది..!!

Tamannaah Bhatia reacts to being called ‘milky beauty’!