అందమయిన విలన్ అనగానే తోలి తరం నటులలో ఆర్.నాగేశ్వర్ రావు గుర్తుకు వస్తారు, ఆ తరువాత ఆలా అన తగిన విలన్ రాలేదు, 1989 లో దాసరి దర్శకత్వం లో వచ్చిన లంకేశ్వరుడు చిత్రంలో చిరంజీవి కి ప్రతి నాయకుడి రూపం లో ఒక అందమయిన విలన్ తెర మీద మెరిశాడు అతనే మహేష్ ఆనంద్, మంచి బాడీ, ఫిగర్ అండ్ గ్లామర్ తో ఎవడ్రా వీడు భలే ఉన్నాడే అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ తరువాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు మహేష్ ఆనంద్, టాప్ హీరో చిత్రం లో బ్రహ్మానందం కాంబినేషన్ లో కామెడీ కూడా పండించి సెహబాష్ అనిపించుకున్నాడు. దాదాపు ఒక దశాబ్దం పాటు తెలుగు తెర మీద అందరు హీరోలతో నటించాడు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గ, ఒక వెలుగు వెలిగాడు మహేష్ ఆనంద్. సడన్ గ వెండి తెర నుండి అంతర్ధానం అయిపోయాడు, వ్యసనాలు అతనిని లొంగ దీసుకున్న్నాయి, వ్యక్తి గత జీవితం అస్త వ్యస్తం అయింది. చివరకు అవకాశాలు లేక, పట్టించుకునే వారు లేక భుక్తి కోసం, మందు కోసం భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసాడు. తనకంటూ ముంబై, వర్సోవాలో మిగిలిన తన సొంత అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చే వాడు కాదు ఎవర్ని కలిసే వాడు కాదు. తాగుడికి , భోజనానికి సరిపడా సంపాందించుకొని ఒంటరిగ కాలం గడిపే వాడు.
చివరకు అతని పరిస్థితి తెలిసిన హిందీ నటుడు గోవిందా అతనికి మళ్ళీ అవకాశం ఇప్పించి, ఒక హిందీ చిత్రం లో నటించేట్లు చేసారు, దాదాపు 15 సంవత్సరాల గ్యాప్ తరువాత వచ్చిన అవకాశాన్ని కూడా అతను సద్వినియోగం చేసుకోక, ఆ వచ్చిన డబ్బు తో, ఖరీదయిన మద్యం తెప్పించుకొని తాగుతూ షూటింగ్ లకు సరిగా వెళ్లే వాడు కాదు. చివరకు రెండు రోజులు సెలవు మీద వెళ్లిన పని మనిషి, తిరిగి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిన, తలుపు తీయక పోయే సరికి అనుమానం వచ్చి, అతని చెల్లికి తెలియచేయటం, ఆవిడా వచ్చి ప్రయత్నించినా తలుపు తీయక పోయే సరికి అనుమానం తో పోలీస్ ల కు చెప్పటం తో వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి, అప్పటికి చనిపోయి, కుళ్ళిన శరీరం తో మహేష్ ఆనంద్ హాల్ లో పడి ఉన్నాడు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని పోస్ట్ మార్టం లో తేలింది. రెండు రోజులుగా ఎవరు రాక పోవటం తో అలాగే ఉండిపోయాడు. అందాల విలన్ అనాధ లాగ మరణించి, ఈ లోకం నుండి న నిష్క్రమించాడు. సినిమా వారు అనుభవించే నేమ్, ఫేమ్ వారిని వాస్తవానికి దూరం చేస్తుందో ఏమో, తప్పటడుగు సరి దిద్దుకొని మరల నార్మల్ లైఫ్ గడపటానికి ప్రయత్నించకుండానే ఇలా అనామకంగా , విషాదభరితం గ జీవితాలు ముగిస్తుంటారు చాల మంది..!!