కార్తికేయ గుమ్మకొండ, అంటే చాలామందికి తెలియకపోవచ్చు , కానీ” Rx 100″ కార్తికేయ అంటే అందరు గుర్తుపడతారు. ఈ కార్తికేయ కండలకొండ, ఏం చేసాడో తెలుసా ? ఎవరైనా ఎగ్జామ్స్ పాస్ అయితే తిరుపతి కి వెళ్లి గుండుకొట్టించుకుంటాము అని మొక్కుకొంటారు, లేదా జాబ్ వస్తే గుండు కొట్టించుకొంటారు. కానీ మన కండలకొండ వరంగల్ యెన్.ఐ .టి లో బీటెక్ చదివే రోజుల్లో, తనతో ఫ్రెండ్లీ గ ఉండే ఒక అమ్మడి కోసం ఆ పని చేసాడు. బీటెక్ చదువుతున్నపుడు తన క్లాసుమేట్, మరియు మంచి ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి, ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది, అంబులెన్సు లో ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసికొని వెళుతుంటే,
కార్తికేయ అంబులెన్సు వెనక పరిగెడుతూ, ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, బయటకు వస్తే కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటాను అని వెంకన్నకు మొక్కుకున్నాడట, ఏడుకొండలవాడు కార్తికేయ మొక్కును అంగీకరించి, ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశాడు. ఇక మనవాడి వంతుగా తిరుపతి ట్రైన్ ఎక్కాడు, తిరిగి గుండుతో హైదరాబాద్ లో దిగాడు, పాపం వాళ్ళ అమ్మ, నాన్నకు తెలియదు, మనవాడికి అర్ధాంతరంగా అంత భక్తి ఎందుకు పుట్టుకొచ్చిందో. ఇప్పుడు తెలిసిందా కార్తెకేయ చదువుకొనే రోజుల నుంచి,” మాంచి Rx 100″ అని. ఇక 90 ఎం.ఎల్. వెనుక కూడా ఇటువంటి స్టోరీ ఏమైనా ఉంది అనుకోకండి ప్లీజ్. మనోడు మంచి గుణాలు వున్నా గుణ..