తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ తనకున్న ఏ చిన్నపాటి అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ సపోర్ట్ తీసుకొంది. ఇప్పుడు ఎన్టీఆర్ ని టార్గెట్ చేసింది. అమీత్ షా – ఎన్టీఆర్ భేటీ ఇప్పుడు రాజకీయ పరంగా.. ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ తో అమిత్ షా ఎందుకు కలిసినట్టు? వీరిద్దరి మధ్యా ఎలాంటి చర్చలు జరిగాయి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్..తెలంగాణలో భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన అమీత్ షా.. ఎన్టీఆర్ తో ములాఖాత్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు గంటసేపు అమీత్ షా, ఎన్టీఆర్‌లు కలిసే ఉన్నారు. కలిసి భోం చేశారు.కలిసి మాట్లాడుకొన్నారు. కచ్చితంగా వీరిద్దరి మధ్యా రాజకీయ పరమైన అంశాలే చర్చకు వచ్చుంటాయి. ఇందులో సందేహమే లేదు..
ఏపీలో..ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది. తను పొలిటికల్ గా క్యాంపెనియింగ్ చేస్తే.. జనాల్ని రాబడతాడు. సో… వచ్చే ఎన్నికలలో ఎన్టీఆర్‌ని వాడుకొనే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీకి ప్రచారం చేశాడు కూడా. బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొంటే ఎన్టీఆర్‌ని వాడేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు.కాకపోతే.. పొత్తు లేని పక్షంలో కూడా బీజేపీకి ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా? అనేదే పెద్ద ప్రశ్న. అసలు ఇది పొలిటికల్ మీటింగే కాదు.. ఏదో ఫార్మాటీ కోసం ఎన్టీఆర్‌ని పిలిచారు.. అంటున్నవాళ్లూ ఉన్నారు. ఎన్టీఆర్ నోరు విప్పితే గానీ, అసలు విషయం బయటకు రాదు. ఏదేమైనా…. ఎన్టీఆర్ తో అమీత్ షా భేటీ.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసినట్టైంది.