ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటీమణులలో నదియాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు, ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఆమె గురించి తెలియని విషయం ఒకటుంది, ఒకప్పుడు ఆమె ప్రేమ కోసం చేసిన గొప్ప త్యాగాన్ని కూడా మనం తెలుసుకోవాలి, నదియా ఇంటర్ చదువుతున్న రోజులలోనే తమ ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ అనే అబ్బాయిని ప్రేమించింది , అయితే శిరీష్ అమెరికాలో జాబ్ చేయాలనీ కలలు కనేవాడట, నదియా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో అతను అమెరికా వెళ్ళిపోయాడట, నదియా సినీ ప్రవేశం చేసి కొన్ని సినిమాలలో హీరోయిన్ గ నటించటం జరిగింది, అప్పటికే శిరీష్ ఉద్యోగం లో సెటిల్ అవటం జరిగింది, దానితో నదియా సినిమాలకు శుభం కార్డు వేసి, శిరీష్ ని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. అయితే శిరీష్ తో పెళ్ళి కుదిరిన సమయం లోనే నదియాకు బాలీ వుడ్ చిత్రం “మైనే ప్యార్ కియా” లో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చిందట..
ఆ సమయం లో సినిమాలలో నటిస్తే మళ్ళీ అందులోనుంచి బయటకు రావటం కష్టం అని భావించిన నదియా అంత గొప్ప అవకాశాన్ని వదులుకొని శిరీష్ చేయందుకొని, సినిమాకు గుడ్ బయ్ చెప్పేసింది. ఆ తరువాత నదియాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, అప్పుడు “అమ్మ నాన్న తమిళ అమ్మాయి” మలయాళం రీ మేక్ లో నటించే అవకాశం వచ్చింది. ఆమె భర్త ఇప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు నీకు ఇష్టం అయిన సినిమాలలో నటించమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆ తరువాతి కథ మనందరికీ తెలిసిందే “అత్తారింటికి దారేది” చిత్రం తో తెలుగు సినిమాలో ప్రేవేశించిన నదియా, మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, అండ్ హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గ చక్రం తిప్పుతున్నారు. సో, నదియాకు ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎప్పుడు నెగ్గాలో కూడా తెలుసు అని చెప్పుకోవాలి, ఫైనల్ గ నదియాను “అల్లుడికి తగ్గ అత్త” అనాలి, తప్పదు మరి!!!