
అల్లు అంటే హాస్యపు జల్లు, పాత తరం హాస్య నటులలో ఎక్కువకాలం నటించిన మరియు ఆర్ధికంగా నిలదొక్కుకున్న ఘనత ఒక్క అల్లు రామలింగయ్య గారికే దక్కుతుంది.ఆయన తో కాసేపు మాట్లాడితే ఒక లైబ్రరీ కి వెళ్లి వచ్చినంత తృప్తి కలుగుతుంది. విషాదం లో కూడా హాస్యాన్ని పండించగలిగిన నటులు కొందరు ఉంటారు. అల్లు రామలింగయ్య గారి నిజ జీవితం లో ఒక విషాద సంఘటన, అంటే వారి కుమారుడు అల్లు వెంకటేశ్వర్ రావు ఒక రైలు ప్రమాదం లో చనిపోయారు, అప్పుడు అల్లు గారు ముత్యాల ముగ్గు సినిమా లో నటిస్తున్నారు.ఆ రోజు అయన షూటింగ్లో పాల్గొని, క్లైమాక్ సీన్ లో కోతి లక్షణాలు వచ్చిన వ్యక్తిగా నటించారు, ఆ సీన్ మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది, సెట్ లో ఉన్న వాళ్ళందరూ అయన అంకిత భావానికి ఆశ్చర్య పడుతూ, జరిగిన విషాద సంఘటనను మరపిస్తూ అల్లు గారు చేసిన పెర్ఫార్మన్స్ కు కంటతడి పెట్టుకున్నారట. నిజమే హాస్య నటుల జీవితం కత్తి మీద సాము లాంటిది వారు ఎడ్చిన ప్రేక్షకులు నవ్వుకుంటారు
 
					 
					
