in

allu arjun’s story goes to vijay devarakonda!

థ‌లు చేతులు మార‌డం చాలా స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగే విష‌యం. ఒక‌రి కోసం రాసుకున్న క‌థ… మ‌రో హీరో ఓకే చేసి ప‌ట్టాఎక్కించ‌డం చూస్తూనే ఉన్నాం. ఈసారీ అదే జ‌ర‌గ‌బోతోంది. అల్లు అర్జున్ కోసం రాసిన క‌థ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. వివ‌రాల్లోకి వెళ్తే..అల్లు అర్జున్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సివుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది కూడా. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేదు.

అల్లు అర్జున్ – పుష్ష క‌థ‌ని ఓకే చేయ‌డం, ఎన్టీఆర్ – కొర‌టాల శివ ఇద్ద‌రూ జ‌ట్టు క‌ట్ట‌డంతో బ‌న్నీ – కొర‌టాల సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాక‌… బ‌న్నీతో కొర‌టాల సినిమా చేస్తాడ‌ని అన్నారంతా. అయితే ఆ అవ‌కాశాలు కూడా క‌నిపించ‌డం లేదు. ఎన్టీఆర్ సినిమా అవ్వ‌గానే.. విజ‌య్ దేవ‌ర‌కొండ తో ఓ సినిమా ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు కొర‌టాల‌. ఇందుకు సంబంధించి వీరిద్ద‌రి మ‌ధ్య డీల్ కూడా కుదిరిపోయింది. అయితే ఈసారి బ‌న్నీ క‌థ‌నే.. విజ‌య్‌కి చెప్పాడ‌ని, విజ‌య్‌కి కూడా ఇదే క‌థ న‌చ్చింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్తయిపోయింది కాబ‌ట్టి, ఎన్టీఆర్ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఏమాత్రం గ్యాప్ లేకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా మొద‌లెట్టేయొచ్చు.

super star mega star combination lo aagipoyina chitram!

Neha Sharma looks stunning in a red halter neck top!