in

Allu Arjun shows special love for Mrunal Thakur!

ల్లు అర్జున్ “హాయ్ నాన్న” టీం పై ప్రశంసల వర్షం కురిపించాడు. “హాయ్ నాన్న టీంకు కంగ్రాట్స్ మూవీ ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ఒక స్వీట్ మూవీ. మనసుకు హత్తుకునేలా ఉంది. నాని పర్ఫామెన్స్ చాలా సహజంగా అనిపిస్తుంది. ఇలాంటి స్క్రిప్ట్ ను వెలుగులోకి తీసుకొచ్చినందుకు నాని పట్ల నాకు గర్వంగా ఉంది. బేబీ కియారా నువ్వు నా డార్లింగ్ అయిపోయావు. నీ క్యూట్ నెస్ తో అందరి మనసులను దోచేస్తున్నావ్ అంటూ హాయ్ నాన్న టీంపై ప్రశంసల వర్షం కురిపించాడు.

అయితే మృణాల్ పై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు స్పెషల్ గా మారాయి. “డియర్ మృణాల్ నీ స్వీట్ నెస్ స్క్రీన్ మొత్తం నిండిపోయింది. స్క్రీన్ పై నువ్వు అందరినీ వెంటాడుతూనే ఉన్నావ్. సినిమా కూడా నీలాగే అందంగా ఉంది” అంటూ హీరోయిన్ పై బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇదంతా చూసి మృణాల్ పై బన్నీ మనసు పారేసుకున్నాడని, తన నెక్స్ట్ మూవీలో ఈ అమ్మడికి ఛాన్స్ ఇవ్వడం ఖాయమని ఆమె అభిమానులు అనుకుంటున్నారు..!!

no scope and interest to salaar team to promote shruthi haasan?

‘one chance please’ payal rajput requests makers!