అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో లో హిస్టారికల్ మూవీ
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బన్నీ, త్రివిక్రమ్ కాంబో మూవీ హిస్టారికల్ మూవీ అని అంటున్నారు. మైథాలజికల్ టచ్ ఉంటుందని, ఇప్పటివరకు ప్రచారం అయ్యింది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ బన్నీ కోసం హిస్టారికల్ స్టోరీ రాస్తున్నాడని, అది బన్నికీ బాగా నచ్చిందని టాక్. మంగోలియన్ల నాయకుడు చెంఘీజ్ ఖాన్ బయోపిక్ అని సమాచారం..
చెంఘీజ్ ఖాన్ బయోపిక్ లో బన్నీ
మంగోలియనల్ని ఏకం చేసి, శత్రువులతో యుద్దానికి దిగి తన రాజ్యాన్ని కాపాడుకున్న చెంఘీజ్ ఖాన్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తే ఆ కిక్కే వేరు అని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. హిస్టారికల్ యాక్షన్ స్టోరీకి ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తి చేసాడని తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ త్రివిక్రమ్, బన్నీ కాంబో మూవీకి స్టోరీ లైన్ ఫిక్స్ అయిపోయిందని, భారీ బడ్జెట్ అవసరం అని పేర్కొన్నాడు..!!