in

kriti sanon reveals her desire to act with icon star!

కాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి కృతి సనన్ దిగిన ఫోటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదే సమయంలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని కూడా చెప్పింది. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి సనన్. “అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.

ఆయన అద్భుతమైన నటుడు..తన నటనకి నేను అభిమానిని. చాలా తెలివైన వ్యక్తి. బన్నీతో కలిసి పనిచేసే క్షణం కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా” అంటూ మరోసారి తన మనసులో కోరికను బయట పెట్టింది కృతి సనన్. బన్నీతో కలిసి నటించాలని ఉందని ఈ హీరోయిన్ చెప్పడం ఇది మొదటిసారి కాదు..!!

Allu Arjun blindly signed Sandeep Vanga’s film!

Rashmika enters Vijay and mrunal thakur’s ‘Family Star’!