in

Allu Arjun and Basil Joseph: Superhero Film AA25 Confirmed?

ట్లీ తర్వాత మరో తమిళ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రజనీకాంత్కూలీ‘ సినిమాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు కూడా. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారు? అనేది పక్కన పెడితే..25వ సినిమా మాత్రం ఫిక్స్ అయ్యింది. ‘జయ జయ జయ జయహే’, ‘పొన్ మ్యాన్’ సహా పలు మలయాళ డబ్బింగులతో తెలుగు ఓటీటీ వీక్షకులకు దగ్గరైన కథానాయకుడు బసిల్ జోసెఫ్. ఆయన హీరో మాత్రమే కాదు..దర్శకుడు కూడా! టోవినో థామస్ హీరోనా ‘మిన్నల్ మురళి’ వంటి పాన్ ఇండియా సినిమా చేశారు.

అల్లు అర్జున్ కోసం ఆయన ఓ కథ రెడీ చేశారు. అది చాలా రోజుల క్రితం వార్త. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే..అది అల్లు అర్జున్ 25వ సినిమా కోసం అట. ఇటీవల జరిగిన అల్లు శిరీష్ – నయనికా రెడ్డిల రిసెప్షన్‌కు బసిల్ జోసెఫ్ వచ్చారు. ఆ తర్వాత ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ‘మిన్నల్ మురళీ’ తరహాలో అల్లు అర్జున్ 25వ సినిమా కోసం సూపర్ హీరో సబ్జెక్టు రెడీ చేశారట బసిల్ జోసెఫ్. అట్లీ దర్శకత్వంలో చేస్తున్నది కూడా సూపర్ హీరో కథే. పాన్ ఇండియాను దాటి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆ తరహా కథలు మంచిదని బన్నీ భావిస్తున్నట్టు ఉన్నారు..!!

Chiranjeevi to Play Mafia Don in Mega 158?

Honey Rose faces misconduct at jewellery store launch!