in

Allu Aravind Wishes Mrunal Thakur Marries a Telugu Boy!

డివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది..ఈ వేడుకలో అల్లు అరవింద్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన గురించి మాట్లాడుతూ..“‘సీతారామం’లో సీతగా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ‘డెకాయిట్’లో సరస్వతి పాత్రలో అంతకంటే పరిణతి చెందిన నటన కనబరిచింది..

భావోద్వేగాలను అద్భుతంగా పలికించింది” అని ప్రశంసించారు. అనంతరం ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి” అని ఆమెను ఆశీర్వదించారు. గతంలో లావణ్య త్రిపాఠికి కూడా ఇలాగే చెప్పానని, ఆ తర్వాత ఆమె వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని తమ ఇంటి కోడలైందని అల్లు అరవింద్ గుర్తుచేశారు. ఆయన మాటలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుతో ముసిముసిగా నవ్వడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

17 years for ‘dhee’!

producer Slaps telugu Comedian Ali