in

Alia Bhatt teaching Telugu to hollywood star Gal Gadot!

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియా భట్ ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అప్పట్లోనే తెలుగు నేర్చుకుని ప్రమోషన్లలో మాట్లాడి ప్రశంసలు పొందారు కూడా. ఇప్పుడు మరోసారి తెలుగు మాట్లాడటమే కాకుండా హాలీవుడ్ నటులకు తెలుగులో ఎలా మాట్లాడాలో నేర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ‘అందరికీ నమస్కారం..మీకు నా ముద్దులు’ అంటూనే ఎలా పలకాలో తన కో స్టార్ గాల్ గాడోట్ కు నేర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

అలియా తెలుగు మాటలకు, ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చక్కగా మాట్లాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలియా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ మూవీలో నటించారు. విలనిజం ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. ఆగష్టు 11న విడుదలవుతున్న సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ మీడియా చిట్ చాట్ లో హాలీవుడ్ నటీనటులకు తెలుగు మాట్లాడటం నేర్పించారు..!!

Baby fame Vaishnavi Chaitanya for ram Double Ismart?

Rajinikanth heads to himalayas after a 4 years gap!