in

Alia Bhatt beats Kiara Advani, Samantha to bag Jr NTR – Kortala Siva film?

టు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తారక్… రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవలే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‏మెంట్ కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలియా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‏కు జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో అలియా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే.. కొరటాల శివ తెరకెక్కించే సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటించనున్నాడని..

ఇందులో పలువురు టాలీవుడ్ హీరోలు సైతం కీలకపాత్రలలో కనిపించనున్నట్లగా టాక్. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు కొరటాల. అలాగే చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

runam heroine priya augustine latest photoshoot!

thamanna apologies to ‘seetimaar’ producers!