చరిత్ర పునరావృతం చేసిన నందమూరి బాలకృష్ణ. కేవలం సాంఘిక చిత్రాలే కాక, పౌరాణిక, జానపద చిత్రాలు నటించే అరుదైన అవకాశం చేచిక్కించుకున్న ఈ తరం నటుడు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, 70 సంవత్సరాల క్రితం తన తండ్రి తో పాతాళ భైరవి చిత్రం నిర్మించిన విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన నాగి రెడ్డి గారి కుమారుడు, వెంకట రామి రెడ్డి, నిర్మించిన జానపద చిత్రం భైరవ ద్వీపం చిత్రం లో బాలకృష్ణ నటించి చరిత్ర సృష్టించారు. పాతాళ భైరవి చిత్రానికి ఆధునిక హంగులు జోడించి నిర్మించిన జానపద చిత్రం భైరవ ద్వీపం. నందమూరి బాలకృష్ణ నటించిన ఏకైక జానపద చిత్రం భైరవ ద్వీపం.
బాలకృష్ణ సరసన రోజా నటించారు, సింగీతం శ్రీనివాస రావు దర్సకత్వం వహించారు. ఈ చిత్రం తరువాత చాలామంది నిర్మాతలు జానపద చిత్రాలు నిర్మించే ప్రయత్నాలు చేసిన కూడా ఖర్చుకు వెరసి వెనకడుగు వేశారు. భైరవ ద్వీపం వచ్చిన 20 ఏళ్ళ తరువాత మరో జానపద చిత్రం బాహుబలి వచ్చింది. ఇక ముందు జాన పద చిత్రాలు వస్తాయో లేదు చెప్పలేము. ప్రతి రోజు నిర్మితమయితే రికార్డు అని అనలేము కదా ? అందుకే బాలకృష్ణ గారు ఎప్పుడు అంటుంటారు, చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్న అది తనకే సాధ్యం అని.