in

Akhil to pair with Janhvi Kapoor under UV creations?

ప్రస్తుతానికి ఆమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకపోయినా ఆమెకు రెండు మూడు తెలుగు ఆఫర్లు తలుపుతడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు..

ఆ సినిమా కోసం ఇప్పుడు జాన్వి కపూర్ ని సినిమా యూనిట్ సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ భామకి మరో అవకాశం కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా యువి ప్రొడక్షన్ సంస్థ ఒక సినిమా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని నటించమని కోరినట్లుగా తెలుస్తోంది. జాన్వీ కపూర్ కి సినిమాలు హిట్లు లేకపోయినా నాగార్జున కొడుకుగా అఖిల్ శ్రీదేవి కుమార్తెగా జాన్వి కపూర్ థియేటర్లకు ఓపెనింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Khushbu converted to different religion after marraige?

kajol devgan in mahesh babu trivikram movie?