లాల్ సలామ్..రజినీకాంత్ ను ఎక్కువ సమయం చూపిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు, తప్పకుండా మంచి కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని యూనిట్ సభ్యులు భావించి అవసరం లేకున్నా కథ పై ఆయన పాత్రను బలవంతంగా రుద్దారు. దాంతో సినిమా ఫలితం తారు మారు అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ..
సినిమా కోసం క్రికెట్ కు సంబంధించిన సన్నివేశాలను 21 రోజులు పది కెమెరాలతో షూట్ చేశాం. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొత్తం ఫుటేజ్ పోయింది. తిరిగి రీ షూట్ చేసే పరిస్థితి లేదు. ఆ క్రికెట్ సన్నివేశాలు ఉండి ఉంటే కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండి ఉండేది అనే అభిప్రాయంను ఆమె వ్యక్తం చేశారు…!!