పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు..మరియు తన రాబోయే చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” ఫైట్ సన్నివేశాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తేరి కి రీమేక్, మరియు దర్శకుడు కథనంలో చాలా మార్పులు చేసాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే. శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా..
సెకండ్ హీరోయిన్‌గా ‘ఏజెంట్’ మరియు ‘గాండీవధారి అర్జున’ ఫేమ్ సాక్షి వైద్య చేరినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఈ హీరోయిన్ బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్ సినిమాలతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో విఫలం కావడంతో, మేకర్స్ ఆమెను రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫైనల్ కాల్ ఇంకా తీసుకోనప్పటికీ, మరొక హీరోయిన్ ఈ పాత్రకు తీసుకొన్నారు..మరి నెక్స్ట్ లైన్ లో ముద్దుగుమ్మ ఎవరో చూడాలి..!!