రవితేజ హీరోగా రూపొందిన ‘క్రాక్’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన ఆ సినిమాను దసరా లేదా దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవితేజ ఆ తర్వాత పలు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో రూపొందబోతుంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక లాయర్ కథతో దర్శకుడు మారుతి స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేశాడట.
రవితేజ బాడీలాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ లాయర్ గా మారి నల్ల కోటు ధరించబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రవితేజ తో కూడా దర్శకుడు మారుతి నల్లకోటు వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత మారుతి ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఆయన సినిమా అంటే ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈమద్య ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు