in

after maharshi Allari Naresh to feature in ‘Aham Brahmasmi’!

రాజేంద్ర ప్ర‌సాద్ త‌ర‌వాత‌… కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు అల్ల‌రి న‌రేష్‌. ప‌దా… ఇర‌వైనా..? అతి త‌క్కువ స‌మ‌యంలోనే 50 సినిమాల మైలురాయిని చేరుకున్నాడు. అయితే చాలా ఏళ్లుగా హిట్ ద‌క్క‌లేదు. అలాంటి స‌మ‌యంలో `మ‌హ‌ర్షి`లో ఓ కీల‌క మైన పాత్ర చేశాడు న‌రేష్‌. ఈ సినిమా హిట్ట‌వ్వ‌డంతో.. న‌రేష్ కి ఆరూపంలో బ్రేక్ దొరికిన‌ట్టైంది. ఆమ‌ధ్య `నాంది`తో సోలో హీరోగా త‌న ఖాతాలో మ‌రో హిట్ వేసుకున్నాడు. ఇప్పుడు `స‌భ‌కు న‌మ‌స్కారం` అనే సినిమా చేస్తున్నాడు. హీరోగా త‌న కెరీర్ కి మ‌ళ్లీ ఊపొచ్చిన త‌రుణంలో.. మ‌ళ్లీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా `మ‌హ‌ర్షి` దారిలోనే న‌డుస్తున్నాడు.

అవును.. ఓ సినిమాలో న‌రేష్ కీ రోల్ పోషించ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ సినిమా మ‌రెవ‌రిదో కాదు. మంచు మ‌నోజ్‌ది. చాలా గ్యాప్ త‌ర‌వాత మ‌నోజ్ చేస్తున్న సినిమా `అహం బ్ర‌హ్మ‌స్మి`. ఇందులో న‌రేష్ ఓ కీల‌కమైన పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. నిజానికి ఈ పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌నోజ్ – తేజ్ మంచి స్నేహితులు. ఆ ఫ్రెండ్ షిప్ కొద్దీ.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని చెప్పుకున్నారు. కానీ సాయి డేట్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో.. న‌రేష్ తో లాగించేస్తున్నార్ట‌. కాక‌పోతే…. ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం రావాల్సివుంది.

Anchor Syamala Saree Stills at an Audio Launch!

Katrina Kaif item song in prabhas ‘Salaar’!