
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]త[/qodef_dropcaps] మిళ్ హీరో కార్తీ వరస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు, రీసెంట్ గ వచ్చిన ఖైదీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. మెగా స్టార్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ‘ఖైదీ’ తో హిట్ కొట్టిన కార్తీ ఇప్పుడు మెగా స్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ మీద కన్నేశాడు. కార్తీ తదుపరి చిత్రం అక్క సెంటిమెంట్ తో సాగే సినిమా కార్తీకి అక్కగా సూర్య భార్య కార్తీ వదిన జ్యోతిక అక్కగా నటిస్తోంది. ఈ సినిమాకి తమిళ్ లొ తంబీ అనే టైటిల్ ని ఖరారు చేసారు, ఇక తంబీ అంటే తెలుగు లొ ఈ సినిమాకి టైటిల్ ఏంటో ఈపాటికి అర్ధం అయిపోయింది అనుకుంటా.. మీ ఆలోచన నిజమే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కి తమ్ముడు అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. మరి అన్నయ్య చిరంజీవి టైటిల్ తో హిట్ కొట్టిన కార్తీ తమ్ముడు ని ఎమ్ చేస్తాడో వేచి చూడాలి.