in

after a gap sai pallavi signs back to back projects!

కంటెంట్ ఉన్న పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, గ్లామర్ షోలకు ఆమడ దూరంలో ఉంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి దాదాపు రెండేళ్లుగా యాక్టివ్ గా లేదు. ఆమె తెలుగులో పాటు తమిళ్ లో కూడా చిత్రాలకు సైన్ చేయలేదు. తమిళ్ లో గార్గీ టైటిల్ తో లేడీ ఓరియంటెడ్ చిత్రం చేసింది. ఇది తెలుగులో కూడా అదే టైటిల్ తో రిలీజ్ అయింది.

దీని తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సాయి పల్లవి కనిపించలేదు. అయితే తాజాగా సాయి పల్లవి మళ్లీ తన కెరీర్ ని స్పీడ్ అప్ చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళ్ లో రెండు సినిమాలకు కమిట్ అయిన సాయి పల్లవి తాజాగా తెలుగులో నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నటిస్తోంది..!!

HAPPY BIRTHDAY P SUSHEELA!

ananya pandey: doing liger movie is my biggest mistake