టాలీవుడ్ లో స్పై సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు వంటి స్పై థ్రిల్లర్స్ ని హాలీవుడ్ రేంజిలో తీస్తూ తెలుగులో తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు ఏకంగా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో మేజర్ అనే సినిమాను తానె హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుస్తున్నాడు అడివి శేష్. కరోనాతో పలుమార్లు ఆలస్యమవుతూ వస్తుంది మేజర్ మూవీ. అయితే ఈ మేజర్ మూవీ టీమ్ కి ఇప్పుడు మరొక షాక్ తగిలింది.
అడివి శేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. గతవారం అడివి శేష్‌కు డెంగ్యూ సోకిందట. దీంతో ఆయన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా భారీగా పడిపోవటంతో అడివి శేష్ సెప్టెంబర్ 18న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని, వదంతులు నమ్మొద్దని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ వర్గాలు అడివి శేష్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.